Dubbapalli | సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 18 : పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ ఉమ్మెత్త శోభరవీందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో స్వచ్ఛత హి సేవ 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని పారిశుద్ధ సిబ్బందితో శుభ్రం చేయించారు.
అనంతరం విద్యార్థులకు చెత్త వేరు చేయడంలో వివిధ రకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, గ్రామస్తులు రవీందర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి స్రవంతి, వార్డు సభ్యులు తాండ్ర అంజయ్య, అనూష శేఖర్, జీపీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.