Suicide | పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మక్కపల్లి రమ్య (15) అనే పదో తరగతి విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ కథనం ప్రకారం.. రమ్య కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
కాగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. దవాఖానలో చికిత్స నిర్వహించినా, అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమె అది భరించలేక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.