జగిత్యాల, మార్చి 28 : ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరా టం చేస్తామని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత సురేశ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఉద్యమిస్తామని తేల్చి చె ప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎకడా కనిపించడం లేదని.. ఆయన మాట కూడా ఎక్కడ వినిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరిని ఏఐ చా ట్బాట్ గ్రోక్‌ని అడిగితే కేసీఆర్ పేరును చెబుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం సీనియర్ నాయకుల తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రజల పక్షాన సభలో ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు.
ఇచ్చిన హామీల అమలు చేయాలని వినూత్న రీతిలో నిరసనలు తెలిపారన్నారు. పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు షటర్లు బిగించాలని, కొండగట్టు అంజన్న ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని మండలిలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్ రమణ కోరారని తెలిపారు. నీళ్లు లేక ఎండిన, అకాల వర్షాల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని, పసుపు, మిర్చి పం టలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స మావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మ ల్లేశం, రైతు సమన్వయ సమితి బాధ్యులు అల్లాల దా మోదర్ రావు, వెంకటేశ్వర్రావు, నాయకులు రిజ్వాన్, గంగిపెల్లి వేణు, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి శేఖర్, కోటగిరి మోహన్, అజుమ్ భాయ్ పాల్గొన్నారు.