Christmas Tree | కోల్ సిటీ, డిసెంబర్ 24: అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.
ఎందుకు పనికి రావని పడేసే పిస్తా డొప్పలను చూసిన ప్రశాంత్ తన ఆలోచన శక్తికి పదను పెట్టి అబ్బురపరిచే విధంగా క్రిస్మస్ చెట్టును రూపొందించాడు. కాగా, ఇప్పటికే ఈ విద్యార్థి పనికి రాని వస్తువులతో ఎన్నో సాంకేతిక పరికరాలు తయారు చేసి పెద్దపల్లి కలెక్టర్ నుంచి ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డును సైతం అందుకున్నాడు.