కరీంనగర్ రూరల్, డిసెంబర్ 25: మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్‌లోని గూంటూర్పల్లి, చేగుర్తి, ఇరుకుల్ల, దుర్శేడ్, తీగులగుట్టపల్లి, నగునూర్, చెర్లభూత్కూర్‌లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే యేసుక్రీస్తు జననం, జీవిత వృత్తాంతంపైన భక్తి గీతాలు అలపించారు. ఆదివారం ఉదయం 10గంటలకు క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. ఇరుకుల్లలో కరీంనగర్ జడ్పీటీసీ పురుమల్ల లలితా శ్రీనివాస్, చేగుర్తి ఎంపీటీసీ ఎల్కపల్లి స్వరూప, చంద్ర మోహన్, ఉపసర్పంచ్ మూత్యం శంకర్‌గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దుర్శేడ్‌లో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, అంజయ్య, వార్డు సభ్యులు రామచంద్రం, కుమార్, తిరుపతి, చేగుర్తిలో సర్పంచ్ చామనపల్లి అరుణ, రాజయ్య, ఎంపీటీసీ ఎల్కపల్లి స్వరూప, , బొమ్మకల్‌లోని గూంటూర్ పల్లిలో సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీలు వెంగలదాసు శ్రీనివాస్, ర్యాకం లక్ష్మి, మోహన్, ఎరువ జోజిరెడ్డి పాల్గొన్నారు. తీగులగుట్టపల్లిలో కార్పొరేటర్ కాశెట్టి లావణ్య, శ్రీనివాస్, కొమ్ము భూమయ్య, కాశెట్టి దామోదర్, సాగర్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గంగాధరలో..
గంగాధర, డిసెంబర్ 25 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయగా, పాస్టర్లు ఉపదేశం చేశారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా సరఫరా చేసిన దుస్తులను స్థానిక సర్పంచులు క్రిస్టియన్లకు అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్లు ప్యాట యాదిప్రకాశ్, గడ్డం పీటర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగులో..
రామడుగు, డిసెంబర్25 : మండలంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పాల్గొని అనాథ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. షానగర్‌లోని బేతేలు ప్రార్థనా మందిరంలో పాస్టర్ పర్లపెల్లి ఏలియా ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైండ్ల కవితతో కలిసి కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన దుస్తులను క్రైస్తవులకు పంపిణీ చేశారు.
అనంతరం క్రిస్మస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పందికుంటపల్లి క్రీస్తు మహిమ ధ్యాన మందిరంలో పాస్టర్స్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు పౌల్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. దీనిలో భాగంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. గోపాల్రావుపేటలో మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్ అలీ కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకుడు అంబటి జోజిరెడ్డి, షానగర్ ఉప సర్పంచ్ గునుకొండ వెంకటనర్సయ్య, నాయకులు సైండ్ల కరుణాకర్, కొత్త వెంకటేశ్, భగవాన్‌రావు, పందికుంటపల్లిలో పాస్టర్ లాజర్, పీటర్, ప్రభు, లచ్చయ్య, అభిలాష్, అభినయ్, అన్విత్, పాస్టర్ కాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం
చొప్పదండి, డిసెంబర్ 25: అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ అన్ని పండుగలను ఘనంగా జరుపుకొనేలా నిధులు మంజూరు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని హోలీషాలోమ్ చర్చి ఆవరణలో ఆదివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండగలకు దుస్తులను పంపిణీచేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం కేక్‌కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు సీపెల్లి గంగయ్య, కొత్తూరి నరేశ్, పాస్టర్లు పాల్గొన్నారు.
క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ..
కొత్తపల్లి, డిసెంబర్ 25 : నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఈటీలు, పీడీలు పాల్గొని కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో పెటా టీఎస్, టీజీ పెటా, పలు క్రీడా సంఘాల బాధ్యులు అంతడుపుల శ్రీనివాస్, యూనిస్పాషా, కడారి రవి, కొమురోజు కృష్ణ, కనకం సమ్మయ్య, హరికిషన్, రమేశ్, వీరన్న, శ్రీనివాసరావు, ఉయ్యాల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.