క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. కరీంనగర్లోని లూర్దుమాత, వెస్లీ సెంటినరీ, సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలతోపాటు ఉమ్మడి జిల్లాలోని చర్చిలన్నీ విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. సోమవారం వేడుకలు అంబరాన్నంటనుండగా, ఆదివారం అర్ధరాత్రి తర్వాతి నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.
– కరీంనగర్ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 24