Yellareddipet | ఎల్లారెడ్డిపేట, జూన్ 28 : వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు. ఆదివారం ఉదయమే వర్షం రావాలని రోకలి బండకి కప్పను కట్టి పసుపు, కుంకుమ పెట్టి వరుణుడికి మొక్కులు చెల్లించుకుని ఇంటింటా తిప్పారు. ప్రత్యేకంగా పూజించిన కప్పతల్లిపై, చిన్నారులపై బిందెలతో నీల్లను పోస్తూ గ్రామస్తులు వరుణుడి కరుణ కోసం మొక్కుకున్నారు.