కనికరంలేని కన్నోళ్లు
తల్లిదండ్రుల చెంత ఆటాపాటలతో అల్లారుముద్దుగా గడపాల్సిన ఆ చిన్నారులు.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో దిక్కులేనివారయ్యారు. తల్లి వద్దని వెళ్లిపోతే చేరదీయాల్సిన ఆ తండ్రి కూడా వదిలేయడంతో ఆ ఇద్దరు పిల్లలు పోలీస్‌స్టేషన్ మెట్లపై బిక్కుబిక్కుమని ఏడ్చారు.
- తల్లి వద్దన్నది.. తండ్రి కాదన్నడు..
- బిక్కుబిక్కుమంటూ రోదించిన చిన్నారులు
తిమ్మాపూర్, ఏప్రిల్ 27 : తల్లిదండ్రుల చెంత ఆటాపాటలతో అల్లారుముద్దుగా గడపాల్సిన ఆ చిన్నారులు.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో దిక్కులేనివారయ్యారు. తల్లి వద్దని వెళ్లిపోతే చేరదీయాల్సిన ఆ తండ్రి కూడా వదిలేయడంతో ఆ ఇద్దరు పిల్లలు పోలీస్‌స్టేషన్ మెట్లపై బిక్కుబిక్కుమని ఏడ్చారు. చివరకు పోలీసుల జోక్యంతో నానమ్మ చెంతకు చేరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఇద్దరు సుమారు పదేళ్ల కింద ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు. అయితే, కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి వేరుగా ఉంటున్నారు.
ఇద్దరు కూతుళ్లతో భార్య వేరే ప్రాంతంలో ఉంటుండగా, భర్త మండలంలోనే ఉంటున్నాడు. అయితే, వీరి పంచాయతీ ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు రాగా, పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కౌన్సిలింగ్‌కు ప్రయత్నించారు. ఈ సమ యంలో ఆమె తనకు భర్త, పిల్లలు అకర్లేదంటూ తాళి, మెట్టలు తీసి టేబుల్‌పై పెట్టి, పిల్లలను స్టేషన్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులు వా రించినా వినకుండా పిల్లలను వదిలేసి వెళ్లిపోగా.. భర్త సైతం తనకు కూడా వద్దంటూ వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు బికుబికుమంటూ ‘అమ్మ కావాలి’ అంటూ రోదిస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసిన పోలీసులతోపాటు అకడున్న వారు ఆవేదనకు లోనయ్యారు. ఎస్ఐ అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకొని ఆమెకు అప్పగించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

