చిగురుమామిడి జూలై 01 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
గ్రామదేవతల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఇప్పటికే వర్షాలకే సాగుకు ఇబ్బందిగా మారిందన్నారు. వరుణుడు కరుణించకపోవడంతో పంటల సాగు నెల రోజులు వెనక్కి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జితేందర్, వార్డు సభ్యులు సుదగోని ఇందిర, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.