Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 6 : చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మకు టీవోటీ ట్రైనర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నూతన సిలబస్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లకు టీవోటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భౌతిక శాస్త్ర విభాగానికి టీవోటీ ట్రైనర్‌గా ప్రిన్సిపల్ శశిధర్ శర్మ ఎంపికయ్యారు.
ఈ శిక్షణ అనంతరం జిల్లాలోని భౌతిక శాస్త్ర జూనియర్ లెక్చరర్లకు నూతన సిలబస్‌కు అనుగుణంగా ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహణ డిజిటల్ విద్యా విన్యాసం ద్వారా బోధన విధానాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలను బోధించే పద్ధతులపై శిక్షణ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఎంపిక కావడం పట్ల చిగురు మామిడి సర్పంచ్ ఆకవరం భవాని, కళాశాల అధ్యాపకులు, కరీంనగర్ జిల్లా అధ్యాపకులు వ్యక్తం చేశారు.