CPI District Committee | చిగురుమామిడి, మే 28: సీపీఐ జిల్లా మహాసభలలో భాగంగా జరిగిన సీపీఐ జిల్లా నూతన కమిటీలో చిగురు మామిడి మండలానికి తగిన ప్రాధాన్యత లభించింది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా గూడెం లక్ష్మి (చిగురుమామిడి) , అందే స్వామి (ఇందుర్తి), బోయిని అశోక్ (రేకొండ), నాగేళ్లి లక్ష్మారెడ్డి (లంబాడి పల్లి) ఎన్నిక కాగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చాడ శ్రీధర్ రెడ్డి (రేకొండ), తేరాల సత్యనారాయణ (చిగురుమామిడి), బోయిని పటేల్ (రేకొండ), అందే చిన్నస్వామి (ఇందుర్తి), మావురపు రాజు (సుందరగిరి), కాంతాల శ్రీనివాస్ రెడ్డి (ఇందుర్తి), లకు అవకాశం కల్పించారు.
నూతనంగా ఎన్నికైన కౌన్సిల్, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాను చాటుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటాలు, ఉద్యమాలు చేపడతామని అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు.