Kolanur | ఓదెల, జూన్ 19 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం పునర్నిర్మాణాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెల్పూర్ గ్రామస్తులు శుక్రవారం సందర్శించారు. కొలనూరులో రూపాయలు రూ.కోటి 30 లక్షలతో నిర్మితమవగా, చెల్పూర్ లో కూడా దేవాలయ పునర్నిర్మాణం పనులు సాగుతున్నట్టు తెలిపారు. కొలనూరులో పూర్తిగా కాకతీయులు నిర్మించిన విధంగా గ్రామస్తులు విరాళాలతో రాతి( బండరాయి)తో పునర్నిర్మాణం చేపట్టారు.
ఇక్కడి కట్టడం గురించి తెలుసుకొని పరిశీలించడానికి వచ్చినట్లు చెల్పూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా కొలనూరు శివాలయం పునర్నిర్మాణం గొప్పగా ఉందని గ్రామస్తులను అభినందించారు. కొలనూర్ శివాలయం నిర్మాణం గురించి వేద పండితుడు నందగిరి అశోక శర్మ, బైరి రవి గౌడ్ లు వారికి వివరించారు. ఇక్కడికి వచ్చిన వారిలో రిటైర్డ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పంజాల రాజన్న, చెల్పూర్ సర్పంచ్ కస్తూరి-రఘు, మాజీ సర్పంచ్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి, శంకరయ్య, గ్రామ ప్రముఖులు తదితరులు ఉన్నారు.