SP Ashok Kumar | జగిత్యాల : పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా సరిహద్దులు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో పోలీసు సిబ్బంశాఖ పశుసంవర్ధక శాఖ అధికారులు 24 గంటలు శక్తుల వారీగా తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పశువులను రవాణా చేసి వాహనదారులు పశువులకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, నిబంధనల ప్రకారం నిర్వహించాలని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్య తీసుకుంటానని విచారించారు. వ్యక్తులు, సంస్థలు స్వయంగా వాహనాలు ఆపీ తనిఖీలు నిర్వహించరాదన్నారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత రెచ్చగొట్టే సభ్యకరమైన పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు మీడియా మానిటరింగ్ సెల్లు ఏర్పాటు చేశామన్నారు.