Vemulawada | వేములవాడ, ఆగస్టు 2 : వేములవాడ పట్టణంలో పలు బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నాయకులతో ఆదివారం కలిసి పరామర్శించారు. భగవంత రావు నగర్లో ఇటీవల ప్రమాదానికి గురై మృతి చెందిన రామ్ కిషన్ రావు కుటుంబం, శివ సాయి నగర్ లో అనారోగ్యంతో బాధపడుతూ చిన్నారి రిహాన్షి మృతి చెందారు.
తండ్రి సంపత్ ను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాదాడి గజానంద రావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, నాయకులు రాపెల్లి రాంబాబు, పెద్ది రాజు, మంత సందీప్, ప్రేమ్ చారి, మణికంఠ, మెండే రాజు తదితరులు ఉన్నారు.