Chakali Ailamma Jayanti | చిగురుమామిడి, సెప్టెంబర్ 26 : చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రేకొండలో రజక సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘ నాయకులు నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు దొడ్డెల సదానందం, ఉపాధ్యక్షులు రాచర్ల రంగయ్య, ప్రధాన కార్యదర్శి దుడ్డేల అనిల్ కుమార్, కోశాధికారి సమ్మయ్య, నాయకులు కిరణ్, మున్నా రాజు, కొత్తపల్లి పరశురాములు, రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.