‘ఉజ్వల’ సిలిండర్లలో కోత!
పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీపై అందజేసే వంట గ్యాస్ సిలిండర్లలో కేంద్రం కోతపెట్టింది. పథకంలో కీలక మార్పులు చేసింది.
- కక్షకట్టిన కేంద్రం.. పథకంలో కొత్త నిబంధనలు
- ఉమ్మడి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు దెబ్బ
- ఏడాదంతా ఎలా సరిపోతాయని అసహనం
పొగచూరిన బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)పై కేంద్రం కత్తిగట్టింది. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్యమే లక్ష్యంగా కొన్నేళ్లుగా అమలవుతున్న పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నది. మొన్నటిదాకా ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై అందజేయగా, ఆ తర్వాత కాలంలో వాటి సంఖ్యను తొమ్మిదికి కుదించింది. తాజాగా ఏడాదికి నాలుగు సిలిండర్లకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. సంవత్సరానికి నాలుగు ఎలా సరిపోతాయంటూ ప్రశ్నిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 25: పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీపై అందజేసే వంట గ్యాస్ సిలిండర్లలో కేంద్రం కోతపెట్టింది. పథకంలో కీలక మార్పులు చేసింది. 2016లో స్కీం ప్రారంభించినప్పుడు ఏడాదికి 12 సిలిండర్లు అందించేది. అనంతరం ఈ సంఖ్యను తొమ్మిదికి కుదించింది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి నాలుగు సిలిండర్లను మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు జారీచేయడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రకటనలు, హామీలకు విరుద్ధంగా తరచూ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తుండడం సరైన విధానమేనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం పేర సిలిండర్ల సరఫరాలో కోత విధిస్తూ తమను ఏడిపిస్తున్నదని, ఏడాదికి నాలుగు ఎలా సరిపోతాయంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉజ్వల సిలిండర్ల సరఫరా తగ్గడంతో పేద కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యిలపై ఆధారపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో 33,369 మంది ఉన్నారు. తాజా నిర్ణయం అమలుతో వీరందరిపై ప్రత్యక్ష ప్రభావం పడనుండగా లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అవసరమైతే చేసే సాయం పెంచాలే గానీ, ఇలా తగ్గించడం ఏంటని మండిపడ్డారు. పేద కుటుంబాల అవసరాల దృష్ట్యా గతంలో మాదిరిగానే పూర్తిస్థాయిలో సబ్సిడీ సిలిండర్లు కొనసాగించాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

