Kondapalkala | మానకొండూర్ రూరల్, మార్చి 28 : మానకొండూర్ మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సాదినేని అమృతమ్మ (110) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతురాలికి ఒక కుమారుడు, నలుగురు కూతుర్లు,15 మంది మనుమలు, మనుమరాల్లు, 21 మంది మునిమనుమలు, మునిమనుమరాలు ఉన్నారు. కాగా శతాధిక వృద్ధురాలి పార్థీవ దేహాన్ని తిలకించేందుకు గ్రామస్థులు బారులు తీరారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.