Vannaram | మానకొండూర్ రూరల్, జనవరి 18 : మానకొండూరు మండలం వన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పొలాడి కవిత భర్త పొలాడి వంశీధర్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
మృతుడి కుటుంబ సభ్యులను ఆదివారం కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్తో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు పరామర్శించి, వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, నాయకులు గడ్డిగణేష్, వివేక్ ఉన్నారు.