కమాన్ చౌరస్తా, మార్చి 12 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థిని శివాన్వికపై(Ceiling fan) ఫ్యాను ఊడిపడి గాయాల పాలయ్యింది. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో హాలులోని ఫ్యాను ఒక్కసారి శివాన్విక పక్కనే పడింది. ఈ క్రమంలో విద్యార్థిని చెంప పైన, చేతికి స్వల్ప గాయాలు అయ్యాయి.
వెంటనే అక్కడే ఉన్న ఏఎన్ఎం స్థానిక ఆర్.ఎం.పి సహాయంతో విద్యార్థినికి వైద్య పరీక్షలు చేయించి పరీక్ష రాయించారు. ఈ క్రమంలో విద్యార్థిని సమయం కొంత వృథా కాగా అదనపు సమయం ఇచ్చి పరీక్షను పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించారు.