CCTV cameras | వీణవంక, అక్టోబర్ 24 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థుల సహకారంతో రూ.లక్ష లతో ఏర్పాటు చేసిన 3 సోలార్ కెమెరాలు, 4 ఫిక్స్డ్ కెమెరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు.
ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలని కోరారు. అనంతరం సీసీ కెమెరాల దాతలు మ్యాక రమేష్, నల్ల తిరుపతిరెడ్డి, గెల్లు మల్లయ్య, శ్రీకాంత్, గెల్లు కొమురయ్య, వీరయ్య, మ్యాక సమ్మయ్యలతో పాటు పలువురు దాతలను ఏసీపీ మాధవి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి, బాబురావు, తిరుపతిరెడ్డి, లడె సంపత్ రావు, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వరూప, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.