Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 30 : చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న రోడ్లను దశలవారీగా సీసీ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ గ్రామస్తులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వడ్లకొండ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు సన్నిల్ల వెంకటేశం, వార్డు సభ్యులు బొమ్మగాని వెంకటేష్, కూన సురేష్, గట్టు మంజుల, అన్నవేని శ్రీనివాస్, చిన్నవేణి మానస, దరవేణి రమ, మౌటం స్వామి వివిధ పార్టీల గ్రామ శాఖ అధ్యక్షులు నరాల రాజయ్య, కలువల సంపత్ రెడ్డి మంద ఎల్లయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.