Chigurumamidi | చిగురుమామిడి, మే 5 : ప్రభుత్వ పాఠశాలలో చదివి చిగురుమామిడి మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నగదు పారితోషంతో సహా పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు. చిగురుమామిడి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన షేక్ మోహబి 543, ఎండీ అశ్ర సుల్తానా 521, గట్టు సాయి వర్షిత 506, అప్పాల అనూష 500 మార్కులు సాధించడంతో ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.20వేలను ఉపసర్పంచ్ చింతపూల అనిల్ వ్యక్తిగతంగా నగదును సర్పంచ్ చింతపూల నరేందర్ తో కలిసి అందజేశారు.
పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించి సీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలని, పాఠశాలకు గ్రామానికి మంచి గుర్తింపును తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయప్రద, లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథరెడ్డి, పాఠశాల మాజీ చైర్మన్ బింగి స్వామి, వార్డు సభ్యులు కిరణ్, ఉమర్, తిరుపతి, లక్ష్మి, పూజ, విజయ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.