Cash incentives | మారుతినగర్, ఆగస్టు 15 : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని నాలుగు జిల్లా పరిషత్, రెండు గురుకుల పాఠశాలల్లోని 7,8,9 తరగతుల్లో గత సంవత్సరం పరీక్షలో ప్రథమ స్థానం నిలిచిన ప్రతి పాఠశాలలోని ముగ్గురు విద్యార్థిని విద్యార్థులకు రూ.500 చొప్పున 18 మందికి, మెట్పల్లి మండలంలోని 11 పాఠశాలలోని 33 మంది విద్యార్థినీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను ట్రస్ట్ నిర్వాహకులు అందజేశారు.
కాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో 51 మంది విద్యార్థులకు రూ.500ల చొప్పున మొత్తం 25,500 నగదు ప్రచారాలను అందజేసినట్లు ట్రస్ట్ కార్యనిర్వాహణాధికారి ఎం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ కూకట్ల రాజేందర్, కొమ్ముల సంతోష్ రెడ్డిలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.