Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ ముదిరి వివాదాలకు దారితీస్తోంది. సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన తోటరాజు కాంగ్రెస్ పార్టీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ టికెట్టును ఆశిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకే టికెట్లు అంతర్గతంగా టికెట్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయగా తోట రాజుకు కాకుండా వేరే అభ్యర్థికి ఖరారు చేసినట్టు తెలుసుకున్న రాజు సోమవారం ఉదయం నుండి కనిపించకుండా పోయారు.
అయితే ఉదయం నుండి అదృశ్యం కావడంతో రాజు గురించి ఒక్కొక్కరిగా ఇంటికి వచ్చి ఆరా తీస్తున్నాడంతో ఆయన సతీమణి దేవలక్ష్మీ ఆందోళన గురవుతున్నారు. వేములవాడ పట్టణ ఎస్సై రామ్మోహన్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన నివాసం వద్ద ఆరా తీయడమే కాకుండా చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఉదయం నుండే కనిపించకపోవడంతో సెల్ ఫోన్ లొకేషన్ కూడా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
రాజు నివాసానికి కాంగ్రెస్ నాయకులు పోలీసులు కాలనీవాసులు చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్పుతున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలు వార్డులలో కూడా టికెట్ల వివాదం కొనసాగుతూనే ఉంది.