Sarangapur | సారంగాపూర్, ఫిబ్రవరి 10: బీర ప్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం లెక్కించగా రూ. 14,13,226, మిశ్రమ బంగారం 17గ్రాములు, 1కిలో 400 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీ నోట్లు 12 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఎండోమెంట్ జిల్లా పరిశీలకులు రాజమౌళిలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, ఆలయ చైర్మెన్ చీర్నెని శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఎలమట్ల హరీష్, ఉప సర్పంచ్ జితేందర్, మాజీ ఎంపీపీ మసర్తి రమేష్, మాజీ సర్పంచ్ గరకుర్తి శిల్ప రమేష్, ఆర్చకులు ఒద్దిపర్తి పెద్ద సంతోష్ కుమార్, మధుకుమార్, చిన్న సంతోష్ కుమార్, తిరుమల సేవా సమితి సభ్యులు, జూనియర్ అసిస్టెంట్ రఘు, వెంకటేష్, ఆలయ కమిటి సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.