Medchal | ఐదో అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Medchal | హైదరాబాద్ శివారులో విషాదం నెలకొంది. తాము ఉంటున్న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Medchal | హైదరాబాద్ శివారులో విషాదం నెలకొంది. తాము ఉంటున్న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం వెస్ట్ గాంధీనగర్లోని భవానీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో వడ్లకొండ ఆనందచారి – అరుణ దంపతులు నివసిస్తున్నారు. వారి కూతురు దీక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని, బెంగళూరు సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ ఆప్తాల్మాలజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 17వ తేదీన ఇంటికి వచ్చి దీక్షిత.. శుక్రవారం మధ్యాహ్నం వారు ఉంటున్న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన దీక్షితను.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ దీక్షిత మృతిచెందింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని.. ఎవరిపైనా అనుమానాలు లేవని దీక్షిత తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

