Sonam Wangchuk: హింసను నివారించేందుకు నిరాహార దీక్షను విరమించాను: సోనమ్ వాంగ్చుక్
Sonam Wangchuk: విద్యార్థులపై అణిచివేత చర్యలను ఆపేందుకు, హింసను నివారించేందుకు ప్రభుత్వంతో ఒప్పందానికి అంగీకరించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. 2025, సెప్టెంబర్ 24వ తేదీన లడాఖ్లో జరిగిన ఫైరింగ్ ఘటనను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల క్షేమం తన దీక్షను విరమించినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీకి మద్దుతుగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 26 రోజుల దీక్షను ఆయన శుక్రవారం బ్రేక్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో డీల్ కుదిరిన తర్వాత ఆయన తన దీక్షను వదిలేశారు. అయితే కేంద్రం ఇచ్చిన హామీల మేరకు తాను దీక్షను విరమించినట్లు వాంగ్చుక్ చెప్పారు. విద్యార్థులపై అణిచివేత చర్యలను ఆపేందుకు, హింసను నివారించేందుకు తాను ప్రభుత్వ ఒప్పందానికి అంగీకరించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. 2025, సెప్టెంబర్ 24వ తేదీన లడాఖ్లో జరిగిన ఫైరింగ్ ఘటనను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల క్షేమం తన దీక్షను విరమించినట్లు చెప్పారు.
శుక్రవారం రాత్రి వాంగ్చుక్ యూట్యూబ్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థులు హింసకు, కేసులకు బలి కావొద్దు అన్న లక్ష్యంతో తాను దీక్షను విరమించినట్లు చెప్పారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల సమయంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తానేమీ డిమాండ్ చేయలేదన్నారు. కానీ మంత్రి ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

