Gangadhara | గంగాధర,జనవరి 18: గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండ్ల పరుగు లో అపశృతి చోటుచేసుకుంది.
ఎడ్ల పందాలను వీడియో తీస్తున్న సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు వినోద్ అనే యువకుడిని పరిగెత్తుతున్న ఎడ్లు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.