Khilavanaparthi | ఖిలావనపర్తి లో ట్రాన్స్ ఫార్మర్ ను తాకి విద్యుత్ షాక్ తో గేదె మృతి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సామంతుల పోచాలు అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎదుట ఆ గేదె మరణించడంతో ఆ వ్యక్తి దానిని కాపాడలేని స్థితిలో తల్లడిల్లాడు.
Khilavanaparthi | ధర్మారం, జూలై 16 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సామంతుల పోచాలు అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎదుట ఆ గేదె మరణించడంతో ఆ వ్యక్తి దానిని కాపాడలేని స్థితిలో తల్లడిల్లాడు. బాధితుడు పోచాలు వివరాల ప్రకారం.. పోచాలు 4 గేదెలను పెంచుతున్నాడు. గురువారం ఉదయం వాటిని ఇంటి నుంచి గ్రామంలోని ఓ మినీ రైస్ మిల్లు సమీపాన ఉన్న గేదెల మందలోకి తోలుకొని వచ్చాడు. వాటిని మందలో కలిపి అక్కడే కొంతసేపు పోచాలు ఉండగా అతని కళ్ల ఎదుట గేదె కరెంట్ షాక్ తగిలి మరణించడం అతనిని కలిచి వేసింది.
ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడంతో దాని నుండి ఎర్త్ వైర్ బయటికి వచ్చి ఉండడంతో దానిని అట్టి గేదె తాకడంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించింది. రైతు కళ్ల ఎదుటే సంఘటన జరగా అప్పటికి అతడు కాపాడే ప్రయత్నం చేయగా అది అప్పటికే మరణించింది. పాడి గేదె మరణం వలన సుమారు రూ.60 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం నుంచి పరిహారం అందించే ఆదుకోవాలని బాధితుడు పోచాలు విజ్ఞప్తి చేస్తున్నాడు. కాగా ఇటీవల మూగజీవాలు ట్రాన్స్ ఫార్మర్ల ను తాకి మరణించడం ఇది రెండవసారి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

