Buffalo | కోరుట్ల, సెప్టెంబర్ 9 : పట్టణ శివారు వెంకటసాయి నగర్ లో విద్యుద్ఘాతంతో 5 బర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు, విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వెంకటసాయి నగర్ కాలనీ సమీపంలో పట్టణానికి చెందిన మహ్మద్ ముజావీర్ రహ్మన్కు చెందిన బర్రెల మంద మేతకు వెళ్లి ఇంటి ముఖం పట్టాయి. అదే సమయంలో బర్రెలు పోట్లాడుకొని ట్రాన్స్ఫార్మర్కు సపోర్ట్‌గా నేలకు ఆనించి ఉన్న విద్యుత్ తీగను ఢీకొట్టాయి. ఈక్రమంలో సపోర్ట్ తీగ తెగి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి బర్రెలపై పడడంతో 5 బర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. కాగ ఒక్కో బర్రె విలువ రూ. 1.30 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బర్రెల యజమాని విజ్ఞప్తి చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన విద్యుత్ అధికారులు నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.