సిరిసిల్ల రూరల్, మార్చి 22: చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ (BRSV) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారన్న అనుమానంతో శనివారం తెల్లవారుజామునే నేతల నివాసాలకు వెళ్లి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కాగా, బీఆర్ఎస్వీ నేతల అరెస్టును చీమల ప్రశాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఓయూలో విద్యార్థి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేకపోవడం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని విద్యార్థులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. వీరిలో పొన్నాల చక్ర పాణి, బోళా వెని ఎల్లం యాదవ్, నందగిరీ భాస్కర్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్..
కరీంనగర్లో జరుగనున్న కేటీఆర్ సభకు వెళ్ళవద్దని మంథనిలోని బీఆర్ఎస్ యూత్ నాయకులు గొబ్బూరి వంశీ, కొవ్వూరి శ్రీకర్, ఆసిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తారనే సమాచారం మేరకు ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.