కార్పొరేషన్/చొప్పదండి/హుజూరాబాద్‌టౌన్/వీణవంక/మానకొండూర్/ రామడుగు/చిగురుమామిడి/గంగాధర, మార్చి 22: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులను జిల్లా వ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. దీంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్వీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేం ప్రజాపాలన.. ఇంకెన్నాళ్లీ ఈ అక్రమ అరెస్ట్‌లు అని మండిపడ్డారు. శనివారం తెల్లవారుజామున 4గంటలకు హుజూరాబాద్ బీఆర్ఎస్వీ నాయకులు అమ్జద్, అఖిల్, అనురాగ్, కరీంనగర్లో బీఆర్ఎస్ నేత దూలం సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చొప్పదండిలో బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్, యువజన విభాగం మండలాధ్యక్షుడు మారం యువరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు భక్తు విజయ్, మండల ప్రధాన కార్యదర్శి జనప శేఖర్, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు సిరవేణి శ్రీకాంత్, విద్యార్థి భాగం పట్టణాధ్యక్షుడు నరేశ్, రావణ్, మండల జనరల్ సెక్రటరీ దాసరి అనిల్, మోదుంపల్లి రాజేందర్, పోరండ్ల నితీశ్, ఎండీ షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారిని పరామర్శించారు.
మానకొండూర్‌లో బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి గుర్రం కిరణ్‌గౌడ్, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు ఆడప శ్రీనివాస్, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు రాయికంటి కిరణ్, మండల ఇన్చార్జి దండబోయిన శేఖర్‌ముదిరాజ్, వీణవంకలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతియాదవ్, అప్పని హరీశ్వర్మ, రాపర్తి అఖిల్‌గౌడ్, ఓంప్రకాశ్, రామడుగులో బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు మచ్చ రమేశ్, గంగాధర మండలంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్, చిగురుమామిడిలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తాటికొండ సందీప్‌రెడ్డి, రేకొండ యూత్ గ్రామాధ్యక్షుడు పడాల ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారు.