Padi Kaushik Reddy | హుజూరాబాద్, డిసెంబర్ 18 : సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంతోనే కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్ బలప రిచిన సర్పంచ్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ 39, కాంగ్రెస్ 29, బీజేపీ 25, స్వతంత్ర 15 స్థానా లను సాధించాయి. ఈటల రాజేందర్ సొంత మండలమైనా కమలాపూర్‌లో కూడా కౌశిక్ రెడ్డి పైచేయి సాధించడం గమనార్హం.
ఇక్కడ మొత్తం 24 గ్రామపంచాయతీలుండగా అత్యధికంగా బీఆర్ఎస్ 10 స్థానాలు సాధించడమే కౌశిక్ రెడ్డి సత్తాకు నిదర్శనం. మిగతా వాటిలో కాంగ్రెస్ 6, బీజేపీ 7, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. అలాగే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్‌బాబు సొంతమండలమైన హుజూరాబాద్ లో కూడా కౌశిక్‌రెడ్డి దుమ్ము రేపారు. ఇక్కడ మొత్తం 20 గ్రామ పంచాయతీలుండగా బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, బీజేపీ 3, స్వతంత్ర 7 స్థానాల్లో సర్పంచుల అభ్యర్థులు గెలిచారు. అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి సొంతమండలమైన వీణవంకలో తిరుగులేని ఫలితాలు సాధించారు.
ఇక్కడ మొత్తం 26 గ్రామపంచాయతీలుండగా కాంగ్రెస్ 6, బీజేపీ 6, స్వతంత్ర 4 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ మద్దతు దారులను 10 స్థానాల్లో గెలిపించుకొని కౌశిక్ రెడ్డి తన బలమెంటో నిరూపించుకొన్నారు. జమ్మికుంటలో మొత్తం 20 గ్రామపంచాయ తీలుండగా 8 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారు లను గెలిపించుకొని కౌశిక్ రెడ్డి దుమ్ము రేపారు. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 5, స్వతంత్ర 3 స్థానాల్లో గెలుపొందాయి. కౌశిక్ రెడ్డి సొంత గ్రామమైన వీణవంకలో బీఆర్ఎస్ గెలుపొందగా, ప్రణవ్ సొంత గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం విశేషం.