రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్లకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లాకేంద్రానికి చేరుకుంటారు.
పట్టణంతోపాటు పలు మండలాల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్ణణాధ్యక్షుడు జిందం చక్రపాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.