రాజన్న సిరిసిల్ల, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
అనంతరం సిరిసిల్లకు చేరుకుని ఉదయం 11.30 గంటలకు భావనారుషినగర్లోని పద్మశాలీ కల్యాణ మండపంలో జరిగే అర్బన్ బ్యాంకు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతారు. ఆయన రాక సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.