Former Minister Koppula Eshwar | పెగడపల్లి: పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు గంగాధర్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు. కాగా మాజీ మంత్రి ఈశ్వర్ బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, గంగాధర్ మృతి పార్టీకి, అతని కుటుంబనికి తీరని లోటని, అతని కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంచర్ల విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, నాయకులు నామ సురెందర్ రావు, కోరుకంటి రాజేశ్వర్ రావు, ఉప్పలంచ లక్ష్మణ్, గొర్రె ప్రశాంత్, లైశెట్టి దామోదర్, తడగొండ రమేష్, నాగుల రాజశేఖర్ గౌడ్, మడిగెల తిరుపతి, భోగ లక్ష్మీనారాయణ, రాజశేఖర్ రెడ్డి, తదితరులున్నారు.