ఇల్లందకుంట నవంబర్ 9 : హుజురాబాద్‌లో 20 ఏండ్లు గెలిచి.. గజ్వేల్ సొంత ఊరు అన్న ఈటల రాజేందర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మండలంలోని మర్రివాణిపల్లి, బోగంపాడు, గడ్డివాణిపల్లి, టేకుర్తి గ్రామాల్లో ప్రచారం చేపట్టగా, మహిళలు మంగళ హారతులు పట్టారు. పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు చుప్పల నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఏడు సార్లు గెలిచినా ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, ఆయనకు హుజూరాబాద్‌పై కృతజ్ఞత ఎక్కడున్నది? అని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇక్కడ గ్రామ సర్పంచులు కల్లాల రాజిరెడ్డి, లలిత, వనమాల వాసు, తిరుపతిరెడ్డి, ఎంపీపీ పావని వెంకటేశ్, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, తెడ్ల ఓదెలు, ఐలమ్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ వైస్ ఎంపీపీ చెక్క రంజిత్, మాజీ ఎంపీటీసీ గీత వీరారెడ్డి, మాజీ సర్పంచులు తిరుపతిరెడ్డి, బుర్ర రమేశ్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్, రాములు, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి ఉన్నారు.