రైతన్న కోసం బీఆర్ఎస్ నేడు ‘చలో కలెక్టరేట్’
రైతుల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పడుతున్నది. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ‘చలో కలెక్టరేట్' చేపట్టింది.
- విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి పిలుపు
పెద్దపల్లి కమాన్, జూలై 26 : రైతుల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పడుతున్నది. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ‘చలో కలెక్టరేట్’ చేపట్టింది. ప్రస్తుతం ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని, లో వోల్టేజీ, కోతలు లేకుండా 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని, రైతులకు సరిపడా యూరియా, ఎరువులను అందించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటలకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతన్నట్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

