జహీరాబాద్, సెప్టెంబర్ 9 : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణను శేఖపూర్ మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి లను బుధవారం జహీరాబాద్ పట్టణంలోఇంటి వద్ద అరెస్టు చేసి జహీరాబాద్ రూరల్ పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా తట్టు నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారన్నారు.
అప్పుల చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి మూడు సంవత్సరాలు అయ్యింది. బిల్లులు ఇవ్వడం చేతకాక పోలీసులను ప్రభుత్వ అధికారులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తే రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు. పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు