Sanjay Baru : రేవంత్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రేనని, ఆయన మళ్లీ గెలువడని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అరాచక పాలనతో జనం విసిగిపోయారు. ఎక్కడ చూసినా ప్రభుత్వంపై వ్యతిరేకతే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సంజయ్ బారు పోస్టు చర్చనీయాంశమైంది.
రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతా అన్నారు. కానీ రూ.12 వేలు అందించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆఖరికి ఆ రూ.12 వేలు కూడా ఇవ్వడంలేదు. కళ్యాణలక్ష్మి పథకం కింద నగదుతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. తులం బంగారం సంగతేమోగానీ ఆ కళ్యాణలక్ష్మి నగదుకే దిక్కులేదు. ఇంతవరకు రైతుబీమాకు ప్రీమియం కూడా చెల్లించలేదు.
బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంటు ఉండేది. కానీ ఇప్పుడు పల్లెల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఆసరా పింఛన్లు రూ.2 వేల చొప్పున పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచనే లేదు. రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేయడంలో కూడా రేవంత్ సర్కారు విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే సంజయ బారు తన విశ్లేషణను వెల్లడించడం విశేషం.
రేవంత్ రెడ్డి వన్ టర్మ్ వండర్, మళ్లీ గెలవడు
ప్రముఖ రాజకీయవేత్త, పాలసీ ఎనలిస్ట్ సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం కష్టమే.. ఈసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంజయ బారు https://t.co/6QwbrjwcCI pic.twitter.com/GPMsHabaOm
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026