చెన్నై : దులీప్ ట్రోఫీ ఫైనల్లో(Duleep Trophy Final) నాలగువ రోజు ఇవాళ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతను వ్యక్తిగతంగా 99 రన్స్ వద్ద ఔటయ్యాడు. తిలక్ వర్మ పోరాడినా.. ఈస్ట్ జోన్ మాత్రం భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈస్ట్ జోన్కు ఫస్ట్ ఇన్నింగ్స్లో 372 రన్స్ లీడ్ దక్కింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ.. ఖురేషి, మోహన్.. రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం లంచ్ కావడంతో.. సౌత్ జోన్ ఫాలోఆన్ ఆడుతుందా లేక ఈస్ట్ జోన్ మళ్లీ బ్యాటింగ్ చేస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. సౌత్ జోన్ తన చివరి నాలుగు వికెట్లను కేవలం 18 రన్స్కే కోల్పోయింది. ఈస్ట్ జోన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 708 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
South Zone are 336 all out. East Zone take a lead of 372 runs in the first innings!
Kounain Quraishi takes the final wicket as Captain Tilak Varma misses out on his century by one run.
The South Zone captain is being appreciated by the East Zone players as he walks off 👏… pic.twitter.com/IizgxUK8K4
— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026