Sandeep Reddy Vanga | శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా
Sekhar Kammula | టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'ఎపిక్' (Epic).
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్’ (Epic). ’90’s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ వేడుకలో భాగంగా ‘ఎపిక్’ టీజర్లో ఉన్న ఒక విలక్షణమైన డైలాగ్పై ఆసక్తికర చర్చ నడిచింది. చిత్రంలో “ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ” అనే డైలాగ్ ఉంది. ఈ సంభాషణపై యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సందీప్ వంగా తనదైన శైలిలో స్పందించారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను.. నాకు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు అసలు నచ్చరు. అయితే, ఆయన చిత్రాల్లోని హీరోయిన్ల పాత్రలు మరియు వారి డిజైనింగ్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ‘ఎపిక్’ టీజర్లో ఈ డైలాగ్ వినడానికి ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. శేఖర్ కమ్ముల హీరో లాంటి అబ్బాయి, నా సినిమాల్లోని హీరో లాంటి అమ్మాయి కలయిక అనే కాన్సెప్ట్ సినిమాపై అంచనాలను పెంచేసింది అని పేర్కొన్నారు. భిన్నమైన ఆలోచనాధోరణి, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో టాలీవుడ్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ములపై సందీప్ వంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ హాట్ టాపిక్‌గా నిలిచాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

