అంతర్గాం, ఏప్రిల్ 17: బీఆర్ఎస్ 25 వసంతాల జాతరకు గులాబీదండు కదం తొక్కాలని, ఆ సభను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుం డం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ర్టాన్ని సాధించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్ర జల కలను సాకారం చేసి సగర్వంగా నిలిపింది గులాబీ జెండా అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి.. ప్రజలను కదిలించి ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గురువారం అంతర్గాం, పాలకుర్తి మండలాల ముఖ్య నాయకులతో ముర్మూరు పంప్‌హౌస్ వద్ద ఆయన స న్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ప్లాఫ్ అయ్యిందని, హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పు డు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిందని, అధికారం కోల్పోయినా ప్రజల వెంటే ఉన్నదని చె ప్పారు.
కేసీఆర్, బీఆర్ఎస్సే ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ కవచమన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే ఇంటి పార్టీ పండుగకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని, రామగుండం నియోజక వర్గంనుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటికొకరు గులాబీ జెండాతో బయలు దేరాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కోల సంతోష్‌గౌడ్, ఇంజపురి నవీన్, నాయకులు గోపు ఐలయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు, కోల లత, బండారి ప్రవీణ్, మేరుగు పోశం, కొల్లూరి సతీశ్, అర్శనపల్లి శ్రీనివాస్, బాదె అంజలి, తుంగపిండి సతీశ్, రాములు, సందెల మల్లయ్య, కోల లత, కొలిపాక మధుకర్, ధరణి రాజేశ్, మహేశ్, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, మాదాసు సతీశ్, శశికుమార్ పాల్గొన్నారు.