Dharmaram | ధర్మారం జూలై 7 : కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వర జలాలను ఎత్తిపోసేదాక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ మండల నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నేత పూస్కూరు రామారావు స్వగృహంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి,బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ వేరువేరుగా మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నిర్మించి, కన్నెపల్లి ద్వారా లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత తొలి సీఎం కేసీఆర్ దేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరంతరంగా కాళేశ్వరం పంపు హౌస్లు నడవగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని బంద్ పెట్టడం దుర్మార్గం అని ,ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక చర్య గా వారు వర్ణించారు.
ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేపల్లి నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని బలరాం రెడ్డి ,శ్రీధర్ ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోతే ఎందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అని వారు డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు నీటి గోసను దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన కేటీఆర్ డిమాండ్ ప్రకారం కాళేశ్వరంలో అంతర్భాగమైన కన్నెపల్లి పంపు హౌస్ ను ప్రారంభించి జలాలను ఎత్తిపోసి అన్నదాతలకు అన్ని విధాలుగా సహకరించాల్సిందేనని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కొరత లేకుండా రైతుల పక్షపాతిగా ఉన్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతతో రైతులను ఇబ్బందిపాలు చేస్తుందని తెలియజేశారు. కాంప్లెక్స్ ఎరువులు బ్లాక్ లో విక్రయించడం వల్ల అవి రైతులకు దొరకక వారు నష్టపోతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కాంప్లెక్స్ ఎరువు డిఏపిని సింగిల్ విండోలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మేడారం పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్ బి ఎస్ జిల్లా మాజీ సభ్యులు పూస్కురు రామారావు, ఎగ్గెల స్వామి, మండల మాజీ కన్వీనర్ పాకాల రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట తిరుపతి, మండల కోఆప్షన్ మాజీ సభ్యుడు ఎండీ రఫీ, పార్టీ సోషల్ మీడియా మండల ఇన్చార్జి దేవి నలినీకాంత్, వార్డు సభ్యుడు గాజుల రాజు, మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ నాయకురాలు కంపల్లి అపర్ణ , పార్టీ నాయకులు నాడెం శ్రీనివాస్,ఆవుల శ్రీనివాస్, అర్ధవెల్లి రాము ,సల్వాజి మాధవరావు, దేవి రాజేందర్, ఆవుల వేణుగోపాల్, గంధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.