KARIMNAGAR | వీణవంక,ఏప్రిల్27:మండల కేంద్రం తో పాటు మండలం లోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశాయిపల్లి లో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, చల్లూరు లో మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు, ఎల్బాకలో మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, పాక్స్ ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి, ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఎగురేశారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. అనంతరం మండలంలోని 26 గ్రామాల నుండి సుమారు 100 వాహనాలలో 6 వే లకు పైగా బీఆర్ఎస్ శ్రేణులు ఎల్కతుర్తికి తరలి వెళ్లారు. ఎల్కతుర్తి వెళ్లిన వాహనాలతో దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.