Rasamayi Balakishan | తిమ్మాపూర్,ఫిబ్రవరి 3: కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెప్పినప్పుడు అనేక దొంగ హామీలు ఇచ్చి గెలిచారని, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ లో గెలిపించిన కూడా దాన్ని రిపీట్ చేస్తారని గుర్తు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అలుగునూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.