కొడిమ్యాల, జూలై 18 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కొడిమ్యా ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మండల ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఇం టింటా వివరించాలని, ఇరువై నెలల పాలన లో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
రిజర్వేషన్ల పేరిట ప్ర భుత్వం బీసీలను మోసం చేస్తున్నదని, పార్లమెంట్లో కొట్లాడాల్సింది పోయి గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపి చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థు లు లేరని, ఇతర పార్టీల నుంచి చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాచుపల్లి వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వద్దకు పలుసార్లు వెళ్లి నిధులు మంజూరు చేయించి, ని ర్మాణం పూర్తి చేయించానని గుర్తు చేశారు. సీఎం రేవంత్ ప్రాజెక్టులపై గల్లీలో ఒక మాట, డిల్లీలో ఒకమాట మాట్లాడుతున్నాడని ఎద్దే వా చేశారు.
బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడకుండా చంద్రబాబుకు తొత్తులా వ్యవహరించారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వ చ్చిన శ్రేణులు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కొడిమ్యాల మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, తిర్మలాపూ ర్ సింగిల్ విండో చైర్మన్ పొలు రాజేందర్, మాజీ జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు పునుగో టి కృష్ణారావు, మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరండ్ల నరేందర్‌రెడ్డి, రైతుబంధుసమితి మాజీ మండల అధ్యక్షులు ల్యా గల రాజేశం, తదితరులు పాల్గొన్నారు.