Veenavanka | వీణవంక, డిసెంబర్ 19 : వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్(BRS) పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ నూతన సర్పంచ్ గజ్జెల మొగిలయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పని ప్రశాంత్, గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి మొగిలి, వార్డు మెంబెర్స్ నరకుడు రమేష్, గెల్లు అశోక్, విద్యార్ధి నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్, రాపర్తి అరవింద్ గౌడ్, గజ్జెల శ్రీకాంత్, నందిపాట రమేష్, మహేందర్, శ్రీనివాస్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.