చొప్పదండి, జూలై 12: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసనలు చేపట్టి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ ఇన్చార్జి బందారపు అజయ్‌కుమార్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు పాష, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, నాయకులు మాచర్ల వినయ్, నలుమాచు రామకృష్ణ, ఏనుగు స్వామిరెడ్డి, ఉస్కెమల్ల మధు, కొత్తూరి నరేశ్, మహేశుని మల్లేశం, నందిరెడ్డి, మల్లేశం, దండె కృష్ణ, రావణ్, మల్లేశం, కుమార్, స్వామి, తిరుపతి, రాములు, చోటు, పద్మ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూలై 12: మండలంలోని చింతకుంట గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రైతులపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైందన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సాబీర్, సర్పంచులు మొగిలి మంజుల-సమ్మయ్య, జింక సంపత్, ఎల్దండి షర్మిల-ప్రకాశ్, గొట్టె పోచయ్య, కడారి శాంత-శ్రీనివాస్, ఎంపీటీసీలు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ఆధ్వర్వంలో రైతులు, నాయకులు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నాగులమల్యాల గ్రామంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చట్టు శ్రీనివాస్, సుడా డైరెక్టర్ లకాకుల మోహన్‌రావు, సర్పంచ్ నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 12: అన్నం పెట్టే రైతన్నలను అవమానించే వారికి పుట్టగతులు ఉండవని, అలాంటి వారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ జూపాక కరుణాకర్, ఏఎంసీ డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, బత్తిని తిరుపతిగౌడ్, శనిగరపు అనిల్‌కుమార్, భవానీసురేశ్, గడ్డం మోహన్‌రావు, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పంజాల జగన్మోహన్గౌడ్, చాడ శేఖర్‌రెడ్డి, పూడూరి మల్లేశం, సైండ్ల కరుణాకర్, చంద్రారెడ్డి, కొత్తూరి నారాయణ, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు ఎడవెల్లి మల్లేశం, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు శనిగరపు అర్జున్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ మొయిజ్, నాయకులు అబ్దుల్ అజీజ్, రాజమౌళి, రమేశ్, శంకర్, లేఖరాజు, తిరుపతి, శ్రీనివాస్, లచ్చయ్య, అనిల్, ప్రశాంత్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 12: కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, బోగొండ ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లో సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, బొమ్మకల్‌లో జోజిరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. చెర్లభూత్కూర్‌లో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్, కూర రంగారెడ్డి, అజయ్, నరేశ్, బొమ్మకల్‌లో నాయకులు గోష్కి శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, మారుతి, ఆంజనేయులు, మల్లయ్య, జక్కినపల్లి శంకర్, దొమ్మటి బాబు, ఆంజనేయులు, శంకర్, మల్లయ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు. దుర్శేడ్‌లోని రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సుంకిశాల సంపత్‌రావు, మంద రాజమల్లు, జువ్వాడి రాజేశ్వర్‌రావు, సుంకిశాల సంపత్‌రావు, నర్సయ్య, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఊరడి మల్లారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దాది సుధాకర్, కూర శ్యాం సుందర్ రెడ్డి, శ్రీరామోజు తిరుపతి, ఆరె శ్రీకాంత్, కమల్ రాజ్, కుమార్, ముస్కు మల్లారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మీనారాయణ, ఎల్కపల్లి చంద్రమౌళి, కాల్వ అశోక్, సర్వర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, జూలై 12: నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్) చౌరస్తాలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సల్ల రవి, జాప లక్ష్మారెడ్డి, ముంజ సంపత్, యాస్వాడ శ్రీకాంత్, దాసం కమలాకర్, అంజయ్య, దిలీప్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డికి పిండ ప్రదానం
గంగాధర, జూలై 12: తెలంగాణలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్‌రెడ్డికి పిండ ప్రదానం చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు కోలపురం లక్ష్మణ్, ద్యావ మధుసూదన్‌రెడ్డి, అట్ల రాజిరెడ్డి, పంజాల ఆంజనేయులు, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, గడ్డం స్వామి, తోట నాంపెల్లి, రేండ్ల శ్రీనివాస్, వంగల మల్లికార్జున్, తడిగొప్పుల రమేశ్, తాళ్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.