Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో ధర్నా, దేశాయిపల్లిలో మాజీఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, వల్బాపూర్‌లో పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ కామిడి కావ్య-శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసనలు తెలిపారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీవైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సరోజన-రాజేంద్రప్రసాద్, జడల రమేష్, గాజుల శంకర్, బావు సంపత్, తిరుపతిగౌడ్, గజ్జెల మొగిలయ్య, కుమార్, ఆయా గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.